నవపక్షం, యాదాద్రి ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లాలో లీగల్ మెట్రాలజీ (తూనికలు, కొలతల శాఖ) ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు (A-1), ప్రైవేట్ వ్యక్తి కాసారం రవీందర్ (A-2)లను నల్లగొండ ఏసీబీ రేంజ్ అధికారులు పట్టుకున్నారు.
ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అరికట్టడం, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందేలా చూడటంలో భాగంగా ఏసీబీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పై ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కేసు నమోదు చేసిన కారణాలు, ఇతర వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.


