నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :
భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన, ఆడియో ఇంజినీరింగ్ రంగంలో విశేష సేవలు అందించిన డా. సాజిద్ ఖాన్ను హైదరాబాద్లో డా. ఎం.డి. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి తన అభ్యర్థిత్వానికి మద్దతు, సహకారం అందించాలని డా. సాజిద్ ఖాన్ను కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన డా. సాజిద్ ఖాన్, యువతలో సామాజిక సేవ పట్ల ఆసక్తి కలిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న వారికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తికి తన మద్దతును ప్రకటించారు.
అనంతరం డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి మద్దతు తెలిపిన డా. సాజిద్ ఖాన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ “సామాజిక సేవా రంగంలో పనిచేస్తున్న నాలాంటి వారికి చట్టసభల్లో అవకాశం కల్పించడం ద్వారా పట్టభద్రుల సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషి చేసే అవకాశం లభిస్తుంది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతో పాటు పట్టభద్రుల హక్కులు, సమస్యలపై నిరంతరం పోరాడేందుకు ప్రతి పట్టభద్రుడూ తన వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని పేర్కొన్నారు.


