నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :
పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల, మర్రిగూడలో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం విద్యార్థులకు డిక్షనరీలను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు, నూతన పదాలను నేర్చుకోవడానికి, పదజాలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి డిక్షనరీలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ డిక్షనరీని ఉపయోగిస్తూ ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని, భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్. కరుణాకర్, పి. శ్రీనివాస్, వి. దొరతి, పి. లింగస్వామి, ఎన్. వెంకటయ్య, మహమ్మద్ రజియుద్దీన్, బి. సూర్యకుమారి, టి. అనురాధ, బి. కోమలి, సాజిద, యాదయ్య, శంకర్, నసరత్, చంద్రమౌళి, సమతా, వెంకటరమణ, లక్ష్మీ, రామ్ నరేష్, శ్రీహరి, కొండల్ తదితర ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


