కార్మిక–రైతు వ్యతిరేక బీజేపీ విధానాలను తిప్పికొట్టాలి సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: ఎండీ ఇమ్రాన్

నవపక్షం, భువనగిరి ప్రతినిధి :

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ ఇమ్రాన్ పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ, సీపీఐ భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార జాతను శుక్రవారం భువనగిరి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఎండీ ఇమ్రాన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు.

కార్మికుల హక్కులను హరిస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నారని విమర్శించారు.

నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ ప్రజల ఆదాయాలు పెరగడం లేదని, నిరుద్యోగం పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, ప్రజలను ఐక్యం చేసి దేశవ్యాప్తంగా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఇమ్రాన్ అన్నారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భువనగిరి పట్టణం నుంచి కార్మికులు, రైతులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి, కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని ఎండీ ఇమ్రాన్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సోమన సబిత, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, సీపీఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, రచ్చ మోహన్ దాస్, ఉమేష్, మల్లేష్, శ్రీను, నరసింహ, జగన్ రాజు, వెంకటేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.