Sunday, November 8, 2026

దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లెక్చరర్ భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేసి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి — విద్యార్థి సంఘాల డిమాండ్

దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న భాస్కర్ బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

మంగళవారం BRSV, ABVP, SFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యార్థినుల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్ భాస్కర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

భాస్కర్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత పోలీస్ కేసు నమోదు చేసి విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కళాశాలలో విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందించి, విద్యార్థినుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, BRSV దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, ABVP నాయకులు గోపీచంద్, SFI డివిజన్ అధ్యక్షులు బుడిగ వెంకటేష్, ముదిగొండ హరిదాస్ తదితరులు పాల్గొన్నారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.