22ఏ నిషేధిత భూముల సమస్యను ఈ ప్రజాప్రభుత్వం పరిష్కరిస్తుంది-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

హైదరాబాద్: హైదరాబాద్ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేరిన భూముల సమస్యపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లాలోని 22ఏ నిషేధిత భూముల సమస్యపై సుమారు నాలుగు నెలల క్రితం తాను అసెంబ్లీలో ప్రస్తావించానని బీర్ల ఐలయ్య గారు తెలిపారు.ఈ సమస్యను పరిష్కరించాలని సంబంధిత శాఖ మంత్రి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని, రాష్ట్ర మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని కోరినట్లు చెప్పారు.దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, తప్పిదాల కారణంగానే యాదాద్రి భువనగిరి జిల్లాలోని అనేక భూములు 22ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లిన పరిస్థితి ఏర్పడిందని బీర్ల ఐలయ్య గారు అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత భూములను 22ఏ పరిధిలో ఉన్నట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సమాచారం పంపడం వల్ల, ఆయా భూములు నిషేధిత భూములుగా నమోదైనట్లు వివరించారు..ఏ పేదవాడి భూమిని లాక్కోవడం, ఎవరినీ ఇబ్బందులకు గురిచేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం కాదని బీర్ల ఐలయ్య గారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. పేదలకు భూములు అందించి, వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో వాటిని ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 22ఏ నిషేధిత జాబితా నుంచి అర్హులైన భూములను తొలగించి బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారని బీర్ల ఐలయ్య గారు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమారు 39 వేల కుటుంబాలకు సంబంధించిన భూములు ఈ సమస్యలో చిక్కుకున్నాయని చెప్పారు..ఈ సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని, అర్హులైన భూ యజమానులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బీర్ల ఐలయ్య గారు స్పష్టం చేశారు. పేదల భూములకు రక్షణ కల్పిస్తూ, వారికి న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.