హెజెలో ఫార్మా ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లి మండలం దొతిగూడెంలోని హెజెలో ఫార్మా కంపెనీలో నిన్న రాత్రి రియాక్టర్ పేలుడు సంభవించి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది.ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఈ రోజు గాంధీ ఆసుపత్రిలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.గతంలో కూడా ఈ కంపెనీలో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఘటనను ఎమ్మెల్యే గారు తీవ్రంగా పరిగణించారు. వెంటనే భువనగిరి జిల్లా కలెక్టర్ గారితో ఫోన్‌లో మాట్లాడి, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.అలాగే యశోద, సన్‌రైజ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండటంతో పాటు, కంపెనీ యాజమాన్యం నుంచి తగిన ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కోరారు.వారివెంట పోచంపల్లి నాయకులు పాక మల్లేష్ యాదవ్, కళ్లెం రాఘవ రెడ్డి, సామా మోహన్ రెడ్డి, అంబరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Popular Categories


