చౌటుప్పల్ హైవే బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి – బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్య గౌడ్

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :
చౌటుప్పల్ పట్టణ పరిధిలో కొనసాగుతున్న జాతీయ రహదారి బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనులను అధికారులు వేగవంతం చేసి ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు చౌటుప్పల్ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, వలిగొండ, మునుగోడు, నారాయణపూర్, ధర్మోజిగూడెం, గుజ్జ తదితర ప్రాంతాల నుంచి చౌటుప్పల్‌కు వచ్చే ప్రజలు కూడా ఇదే మార్గాన్ని వినియోగిస్తున్నారని తెలిపారు. బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా పెరిగి ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోందని, నిర్మాణ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ ప్రాంతంలో సరైన బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, రాత్రివేళల్లో లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.

బ్రిడ్జి నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో చేపట్టాలని సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, నాణ్యత లోపాలు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.

రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చౌటుప్పల్‌లో జరుగుతున్న బ్రిడ్జి, రోడ్డు పనులను పరిశీలించేందుకు ఇప్పటివరకు రాకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీకే పరిమితమయ్యారని ఆరోపించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని డిమాండ్ చేశారు.

బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు, పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్‌ను సక్రమంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చౌటుప్పల్ ఆర్డీఓకు అందజేసిన వినతిపత్రంలో కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్, మునుగోడు బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షుడు నల్పరాజు రమేష్, మండల నాయకులు బోయ శ్రీరాములు, ధర్మోజిగూడెం గ్రామ అధ్యక్షుడు బత్తుల సింహాద్రి, నారాయణపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు తెలంగాణ భిక్షం, గుజ్జ గ్రామ శాఖ అధ్యక్షుడు సత్తయ్య, నాయకులు పొట్ట జంగయ్య, సుర్వి లింగస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.