నవపక్షం, చౌటుప్పల్ / అక్టోబర్ 01:
కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 2, 2026 న మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆపరేషన్లకు ఎంపికై ఆపరేషన్లు చేయించుకున్న వారికి మరోమారు పరీక్షించడానికి మునుగోడు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రివ్యూ వైద్య శిబిరం నిర్వహించారు ఈ రివ్యూ వైద్య శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న కొత్తవారికి కూడా కంటి పరీక్షలు నిర్వహించారు గతంలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న 95 మందికి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేసిన కండ్ల పనితీరును పరిశీలించారు ఇదే వైద్య శిబిరంలో మరో 195 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 52 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు ఎంపికైన వారిలో 51 మందిని వెంటనే కంటి శస్త్ర చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు 127 మంది కళ్ళజోళ్ళు వాడాలని సూచించారు ఈ 127 మందికి వచ్చేవారం కళ్ళజోల్ల పంపిణీ జరుగుతుంది అని తెలియజేశారు


