డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌పై కోదండరాం వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి – ఉప్పు కృష్ణ

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :

డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలంటూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ఉప్పు కృష్ణ డిమాండ్ చేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం నిర్వహించిన పాదయాత్రను ప్రారంభించిన సందర్భంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కోదండరాం చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల సాగునీటి అవసరాల నేపథ్యంలో అభ్యంతరకరంగా ఉన్నాయని ఉప్పు కృష్ణ అన్నారు. ఈ వ్యాఖ్యలపై పునరాలోచించి వాటిని ఉపసంహరించుకోవాలని కోరారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో సాగునీటి సమస్యల పరిష్కారానికి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కీలకమని, ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీటి వనరుల అభివృద్ధి అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పనులను పూర్తి చేసి, అవసరమైన కాలువలు, చెరువులు తదితర నీటి పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేసి రైతులకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సాగునీటి కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్న సమయంలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా సాగునీటి సమస్యలపై ప్రజా ప్రతినిధులు స్పందించి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉప్పు కృష్ణ అన్నారు.

డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలన్న కోదండరాం అభిప్రాయంపై దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, భువనగిరి, నల్గొండ పార్లమెంట్ సభ్యులు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని ఆయన కోరారు.

దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో సాగునీటి సమస్యలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంతో పాటు, ప్రాజెక్టు ద్వారా లభించే నీటిని కాలువలు, చెరువుల ద్వారా అర్హత ఉన్న ఆయకట్టుకు అందించే విధంగా సమగ్ర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల సాగునీటి అవసరాల కోసం మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కోదండరాం, అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల సాగునీటి అవసరాలు, సమస్యలపై కూడా దృష్టి సారించాలని ఉప్పు కృష్ణ కోరారు.

డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, నీటి పంపిణీ, రైతుల ప్రయోజనాలపై రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Hot this week

కబడ్డీ లో మెరిసిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

    నవపక్షం , శాలిగౌరారం ప్రతినిధి : జిల్లా స్థాయి కబడ్డీ క్రీడ పోటీల్లో...

భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి: ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత...

నేలపట్ల గ్రామపంచాయతీలో డీఎల్‌పీవో విచారణ

  నవపక్షం ప్రతినిధి, చౌటుప్పల్ / అక్టోబర్ 01: నేలపట్ల గ్రామపంచాయతీలో సర్పంచ్ వసంత భర్త...

కంటి వైద్య రివ్యూ శిబిరానికి అనూహ్య స్పందన

నవపక్షం, చౌటుప్పల్ / అక్టోబర్ 01:   కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 2,...

మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి MLC నెల్లికంటి సత్యం కలిసి సబ్ స్టేషన్ ప్రారంభం

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :   చిమ్మిర్యాల గ్రామంలో 3 కోట్ల వ్యయంతో నిర్మించిన...

Topics

మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి

  నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తన్నీరు...

భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి – ఉప్పు కృష్ణ

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించకుండా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.