మై భారత్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి : 

మై భారత్ ఆధ్వర్యంలో పాతూరు గ్రామంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ దొడ్ల సంపత్ రెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ వెంకట్ రెడ్డి , మై భారత్ వాలంటీర్ సాయి వర్ధన్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మై భారత్ వాలంటీర్ సాయి వర్ధన్ మాట్లాడుతూ యువత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన సత్యం, అహింస మార్గంలో నడవాలని అన్నారు.
అనంతరం గ్రామ సర్పంచ్ దొడ్ల సంపత్ రెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ వెంకట్ రెడ్డి గ్రామ అభివృద్ధికి చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల ఉపాధి కల్పించగా, ప్రస్తుతం వి.బి.జి. రామ్.జి. కింద 125 రోజులకు ఉపాధి హామీ పొడిగించబడిందని తెలిపారు. గ్రామంలో వి.బి.జి. రామ్.జి. కింద 375 పనులు చేపట్టినట్లు వివరించారు. ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, ఇంకుడు గుంతలు, తడి-పొడి చెత్త నిర్వహణ, బోర్‌వెల్స్, సోలార్ ప్యానెల్స్, ఇందిరమ్మ ఇళ్లు, వర్మీ కంపోస్ట్ తదితర అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొడ్ల సంపత్ రెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ వెంకట్ రెడ్డి, మై భారత్ వాలంటీర్ కైల సాయి వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Hot this week

జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఉద్యోగులతో సమానంగా షరతులు లేని క్యాష్ లెస్...

గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ వస్త్రాల ప్రదర్శన సందర్శించిన లక్ష్మీ భార్గవి దువ్వాడ

నవపక్షం, విశాఖపట్నం ప్రతినిధి : గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి – సందీప్ బల్లెం, స్కిలోక్రసీ కో ఫౌండర్

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి : మధుబాబు చికిలే ఫౌండర్ – స్కిలోక్రసీ,

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి ;  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

అత్య పాత్య జాతీయస్థాయిలో రాణిస్తున్న దమ్మపేట విద్యార్థులు 

నవపక్షం, దమ్మపేట ప్రతినిధి :   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందినటువంటి...

Topics

భువనగిరి రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : భువనగిరి పట్టణంలోని రిలయన్స్ రిటైల్...

యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్

  నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్....

బేగంపేటలో బాలమల్లు కుటుంబానికి ఆర్థిక సాయం

నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలం, బేగంపేట: గ్రామానికి చెందిన...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.