నవపక్షం, జనగామ జిల్లా ప్రతినిధి :
జనగామ జిల్లా కడవెండి గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు శత జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు పాల్గొని, నల్లా నర్సింహులు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నల్లా నర్సింహులు తెలంగాణ సాయుధ పోరాటంలో చేసిన పోరాటాన్ని, ప్రజల కోసం అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.


