నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :
దేవరకొండ పట్టణంలో అనధికారికంగా చిన్న సిలిండర్లలో రీఫిల్ చేయడానికి ఉపయోగిస్తున్న గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ (5)లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి బాధ్యులైన (గౌరు శ్రీనివాస్, తేలుకుంట్ల రమేష్) ఇద్దరిపై కేసు నమోదు చేసి సీజ్ చేసిన సిలిండర్‌లను హెచ్.పీ గ్యాస్ గోడౌన్‌కు తరలించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

