నవపక్షం, గాంధీభవన్ ప్రతినిధి: యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఇందిరాభవన్‌లో యూత్ కాంగ్రెస్ జెండాను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఎగురవేసి, యూత్ కాంగ్రెస్ శ్రేణులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.






