కల్తీ, కుళ్లిపోయిన బెల్లంపై టాస్క్‌ఫోర్స్ దాడి – 7,500 కిలోల బెల్లం స్వాధీనం

వికారాబాద్ జిల్లా, ఆగస్టు 15:

జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆదేశాల మేరకు జిల్లాలో నిబంధనల ఉల్లంఘనలపై టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది.

ఇందులో భాగంగా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.కె. అన్వార్ పాషా ఆధ్వర్యంలో బంట్వారం మండలం బోపనారం గ్రామ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తాండూర్‌కు ఆటోలో తరలిస్తున్న సుమారు 4 క్వింటాళ్ల కల్తీ, కుళ్లిపోయిన బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆటోలో ఉన్న చంద్ పాషా, డ్రైవర్ మొహమ్మద్ కుతుబొద్దీన్‌లను విచారించగా, వారి దుకాణంలో కూడా కల్తీ, కుళ్లిపోయిన బెల్లం నిల్వ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆటోలో తరలిస్తున్న బెల్లంతో పాటు దుకాణంలో నిల్వ ఉన్న బెల్లాన్ని కలిపి మొత్తం 7,500 కిలోల కల్తీ, కుళ్లిపోయిన బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న బెల్లాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బంట్వారం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.కె. అన్వార్ పాషా మాట్లాడుతూ.. “ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ వ్యాపారాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వం. కల్తీ, కుళ్లిపోయిన ఆహార పదార్థాల నిల్వలు, రవాణాపై నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తాం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

కల్తీ ఆహార పదార్థాల విక్రయం, నిల్వ లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.