చౌటుప్పల్‌లో మహిళ హత్య కేసు ఛేదన పెళ్లికి నిరాకరించడంతో ఘర్షణ.. కర్రతో తలపై కొట్టి హత్య నిందితుడు సయ్యద్ బషీర్ అరెస్ట్.. జుడీష్యల్ రిమాండ్‌కు తరలింపు

నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 15:

చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన ఎం.డి. సలీమా (38) అదృశ్యమైన కేసును చౌటుప్పల్ పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 25న ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సలీమా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి ఎం.డి. పెద్ద సైదాబీ ఆగస్టు 1న చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ బషీర్ (37)ను పోలీసులు విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. జూలై 25న మధ్యాహ్నం భువనగిరి బస్టాండ్‌లో సలీమాను బషీర్ తన పల్సర్ మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని తుర్కపల్లి రోడ్డులోని వెంకటాపురం గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కొంతసేపు ఇద్దరూ మాట్లాడుకున్న అనంతరం ఘర్షణ చోటుచేసుకుంది. సలీమా తనను పెళ్లి చేసుకోవాలని కోరగా బషీర్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో సలీమాను వదిలించుకోవాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న కర్రతో ఆమె తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు సయ్యద్ బషీర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జుడీష్యల్ రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ వెల్లడించారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.