వృద్ధులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

గురువారం చౌటుప్పల్ మండలం పెద్దకొండూర్ గ్రామ పరిధిలో ప్రభుత్వ అనుబంధంతో, రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయి యాదాద్రి సేవాశ్రమాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆశ్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో ప్రస్తుతం ఎంతమంది వృద్ధులు ఉంటున్నారని , వారికి కల్పిస్తున్న వసతులు, ప్రతిరోజూ అందిస్తున్న భోజన సదుపాయాలపై ఆరా తీశారు.
వృద్ధుల ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయించడం,జరుగుతుందా అని,క్యారమ్స్, వివిధ ఆటలు ఆడించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ అభినందించారు. వృద్ధుల ఆరోగ్యంతో పాటు వారి మానసిక ఆనందానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.వృద్ధులను అప్పుడప్పుడు విహారయాత్రలు, పర్యటనలకు తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. వయస్సు పైబడిన వారికి ఇలాంటి పర్యటనలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు ఆత్మసంతృప్తిని అందిస్తాయని తెలిపారు. వారి పట్ల ఆప్యాయత, ఆదరణ చూపుతూ కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకోవాలని సూచించారు.ఆశ్రమానికి ప్రభుత్వం పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆశ్రమంలోని వృద్ధులకు కలెక్టర్ పండ్లు పంపిణీ చేసి, వారితో ఆప్యాయంగా మాట్లాడారు,వారి ఆరోగ్యం, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.వృద్ధుల సంక్షేమం కోసం సేవాశ్రమం నిర్వాహకులు చేస్తున్న సేవలను జిల్లా కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమం లో చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి,శిశు సంక్షేమ అధికారి శ్రీనివాస్, సాయి సేవా నిర్వాహకులు అశోక్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.