నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 20 :
భారత రత్న, ఆధునిక సాంకేతిక నిర్మాత స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిడం జరిగింది,
ఈ సందర్భంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి, నాయకులు మాట్లాడుతూ భారత దేశానికి రాజీవ్ గాంధీ సేవలను కొనియాడుతూ, దేశానికి కంప్యూటర్ టెక్నాలజీ వ్యవస్థను అందించి సాంకేతిక విప్లవానికి నాంది పలికాడనీ, 18సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడా నీ దేశ సమానత్వం కోసం ప్రాణ త్యాగం చేశాడని తెలిపారు,
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య గారు,వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి గారు, మండల & మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్ గారు, కాసర్ల శ్రీనివాస్ రెడ్డిగారు సర్పంచ్ తిగుళ్ళ చంద్రయ్య, కో ఆప్షన్ మెంబర్లు బాబా షరీఫ్, పస్తం గంగారాం, దేవాలయ చైర్మన్ బొబ్బిల్లా మురళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు డిల్లీ చంద్రకళ, పబ్బు శ్రీకాంత్, బోయ వెంకట్, చిమ్ముల వెంకట్ రెడ్డి, శంకర్ నాయక్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బక్క శ్రీనాథ్,బత్తుల శ్రీహరి, షాది ఖాన చైర్మన్ ఎం డి కరీం, ఆవుల యేసు, లచ్చునాయక,బండమీద వెంకటేశం,తోరుపూనూరి శ్రీకాంత్, కడగంచి జనార్ధన్, పాశం కృష్ణ, కొండె నరసింహ, ఉదరీ రమేష్, నరసింహ చారి, తదితరులు పాల్గొన్నారు


