ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు

నవపక్షం ,చౌటుప్పల్, ఆగస్టు 20:

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ సమక్షంలో ఏఈఓ వీణ రైతులతో సమావేశమై పంటల సాగుపై అవగాహన కల్పించారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి సాగుతో ఆశించిన దిగుబడులు రాకపోయే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని ఏఈఓ వీణ సూచించారు. కంది, పెసర, మినుము, బొబ్బర్లు, శనగ, ఉలవలు, కూరగాయలు వంటి పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ నీటితో మంచి దిగుబడులు, సత్వర లాభాలు పొందవచ్చని వివరించారు.

సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ రైతులు తమ భూములను ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పంట తప్పనిసరిగా సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ భూములను సాగులో ఉంచడం ద్వారా ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాకులారం మల్లారెడ్డి, దొడ్ల సెట్టయ్య, పర్ని రామచంద్రరెడ్డి, ఇటికాల నర్సిరెడ్డి, భీమగోని బాలరాజ్, మోడెపు నరసింహ, పెంటయ్య, జంగయ్య, ముద్దం సెట్టయ్య, వెంకటేశం, శ్రీను ముత్యాలు, సుర్వి లచ్చయ్య, రాములు, దాసు, గంగిరెడ్డి అంజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఇమ్మడి ఏసుదాస్, ఇరగదిండ్ల ఈద్దయ్య, కే. యాదిరెడ్డి, కే. జంగారెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.