Sunday, November 8, 2026

ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడులు.. ఏజెన్సీలో అక్షర వెలుగులు

  • దమ్మపేట నవపక్షం :-

ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేట్ బడులకు దీటుగా అత్యుత్తమ ప్రమాణాలతో వర్ధిల్లాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పమని, ఆ సంకల్పాన్ని అశ్వారావుపేట ఏజెన్సీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో అక్షరాలా నెరవేరుస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. ఒకప్పటి ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడిగా (పీఈటీ) పనిచేసిన ఆయన, బడి పిల్లల కష్టనష్టాలను దగ్గరగా చూసిన వ్యక్తి కావడంతో.. ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో తన సొంత చొరవతో ‘మన బడి – మన ఎమ్మెల్యే’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో దిశ ముఖాముఖిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈ కార్యక్రమం ద్వారా విద్యాభివృద్ధికి సంబంధించిన తన ప్రణాళికలు, లక్ష్యాలను పంచుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు ఆశ్రమ, గురుకుల పాఠశాలలన్నింటినీ విధిగా సందర్శించాలనేది తన ప్రణాళిక అని ఆయన అన్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అనేక పాఠశాలలను తాను సందర్శించినట్లు ఆయన తెలిపారు. తన పర్యటనలన్నీ ముందస్తు సమాచారం లేకుండా సడన్ విజిట్స్ గానే ఉంటాయని అన్నారు. బడికి వెళ్లి ఏదో పైపైన పరిశీలించి రాకుండా, ఆ రోజంతా అక్కడే విద్యార్థులతోనే గడుపుతాను. నేరుగా తరగతి గదుల్లో కూర్చుని, విద్యార్థులతో మమేకమై స్వయంగా పుస్తకాలు చదివించడం, బోర్డుపై రాయించడం ద్వారా వారి అభ్యసన సామర్థ్యాలను నేరుగా అంచనా వేస్తున్నాను. ఉపాధ్యాయులతో ముఖాముఖిగా మాట్లాడి, విద్యాబోధనలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటున్నాను అని ఎమ్మెల్యే వివరించారు.

Also Read – వేటగాళ్ల ఉచ్చులో దుప్పి.. గర్భంలో పిండాన్ని కాపాడేందుకు వైద్యుడి విఫలయత్నం

అశ్వారావుపేట ఏజెన్సీ నియోజకవర్గం కావడంతో మారుమూల అటవీ ప్రాంతాలు, గిరిజన గూడేలు, తండాల విద్యార్థులు ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదన్నదే తన ప్రాథమిక లక్ష్యమని ఆయన అన్నారు. కనీస సౌకర్యాల లేమితో గిరిజన విద్యార్థులు మధ్యలోనే బడి మానేయకుండా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. నూరు శాతం హాజరుతో పాటు ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యాశాఖ అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తూ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. పాఠశాలల సందర్శనకు వెళ్లినప్పుడు అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందినీ స్వయంగా తాను నోట్ చేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రధానంగా త్రాగునీటి సమస్య, మరుగుదొడ్ల కొరత, పాతబడిన భవనాల స్థానంలో నూతన భవనాల నిర్మాణం వంటి మౌలిక వసతుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణమే నిధులు మంజూరు చేయిస్తున్నామని అన్నారు. ప్రతి బడి ఆస్తులను కాపాడటంతో పాటు, విద్యార్థులకు భద్రత కల్పించేందుకు రక్షణ గోడలు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. పాఠశాల ఆవరణ పరిసరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చూడటం, డిజిటల్ తరగతుల ఏర్పాటు తన లక్ష్యాల్లో ముఖ్యమైనవని స్పష్టం చేశారు

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.