కొత్తగూడెం నియోజకవర్గంలో 18 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలి

ఆల్ స్పోర్ట్స్ అసోసియేషన్లు, సీనియర్ క్రీడాకారులతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పోర్ట్స్ రివ్యూ మీటింగ్

కొత్తగూడెం నవ పక్షం :- ప్రతి నిధి :-నాగశివాజీ :-

కొత్తగూడెం నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించి, క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు కృషి చేస్తామని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, కోచ్‌లతో స్పోర్ట్స్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో క్రీడల ప్రస్తుత పరిస్థితి, క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అందుబాటులో ఉన్న క్రీడా మైదానాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా బృందావనం ప్రాంతం సమీపంలో సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో సమగ్ర క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడలకు అవసరమైన మౌలిక వసతులతో కూడిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుతో స్థానిక క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని క్రీడా సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

నియోజకవర్గంలోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారికి శిక్షణ, మౌలిక వసతులు, పోటీలకు అవసరమైన సహకారం అందించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొత్తగూడెం క్రీడాకారులు రాణించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

క్రీడా మైదానాల అభివృద్ధి, కోచ్‌లకు అవసరమైన సౌకర్యాలు, క్రీడాకారులకు శిక్షణా వసతులు, వివిధ క్రీడా సంఘాల సమస్యలు తదితర అంశాలపై కూడా చర్చ జరిగింది.

ఈ సమావేశంలో జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామా రెడ్డి, వాసిరెడ్డి మురళీ, మహీధర్, పుట్టా శంకరయ్య, డా. యుగేందర్ రెడ్డి, వాసిరెడ్డి నరేష్, ప్రేమ్, బావుసింగ్, వై.వి. వెంకటేశ్వరరావు, బాబ్జి, ఖాసీం, మాటపర్తి రమేష్, హనుమత్ రావు, చలపతి, ఉదయ్ తదితరులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు మరియు కోచ్‌లు పాల్గొన్నారు.

క్రీడా ప్రాంగణం ఏర్పాటుతో కొత్తగూడెం క్రీడలకు కొత్త దిశ

18 ఎకరాల్లో సమగ్ర క్రీడా ప్రాంగణం ఏర్పాటు జరిగితే నియోజకవర్గంలోని యువతకు నాణ్యమైన శిక్షణా వసతులు అందుబాటులోకి రావడంతో పాటు, ప్రతిభావంతులైన క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు మరింత అవకాశం లభిస్తుందని క్రీడా సంఘాల ప్రతినిధులు తెలిపారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.