నవపక్షం, నకిరేకల్, ఆగస్టు 31:
సెప్టెంబర్ 5న నకిరేకల్‌లో నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాథగొని కొండయ్య పిలుపునిచ్చారు.
సీఎం సభ ఏర్పాట్లు, జన సమీకరణపై సోమవారం మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాథగొని కొండయ్యతో పాటు పీసీసీ డెలిగేట్ ఏసుపాదం, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రజా పాలన కొనసాగిస్తోందన్నారు.
ముఖ్యమంత్రి నకిరేకల్‌కు రావడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని వారు పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం కావడానికి ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అండగా నిలవాలని కోరారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు గ్రామాల వారీగా జన సమీకరణ చేపట్టాలని పార్టీ నాయకులకు సూచించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు వీరార్జున్‌రెడ్డి, నకిరేకంటి నరేందర్, స్వప్న, కృష్ణవేణి, వెంకటచారి, యాదగిరిరెడ్డి, జన్రెడ్డి, యల్లేష్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
