నవపక్షం, చెంగిచెర్ల ప్రతినిధి :
గాంధీనగర్ నగర్ కాలనీకి చెందిన రాఘవోని ప్రభాకర్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ గాంధీనగర్ నగర్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
కాలనీ ప్రెసిడెంట్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, పెద్దలు, యువకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రభాకర్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ప్రభాకర్ అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గాంధీనగర్ నగర్ కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, యువకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.


