శ్రీకృష్ణుని బోధనలు స్ఫూర్తిదాయకం

నవపక్షం, వేములవాడ ప్రతినిధి :

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, హిందూ పురాణాలలో విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుని విశిష్టత, ఆయన తత్వం, జీవిత పాఠాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని అన్నారు. సమాజానికి మార్గదర్శకత్వం చేసే విధంగా శ్రీకృష్ణుడు అందించిన సందేశాలు మానవాళికి ఎల్లప్పుడూ ఆదర్శనీయమని పేర్కొన్నారు.

కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి కర్తవ్యాన్ని బోధిస్తూ, అధర్మాన్ని అణచి ధర్మాన్ని నిలబెట్టేందుకు శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశం మానవాళికి జీవనవేదం అని తెలిపారు. రాధాకృష్ణుల తత్వం ద్వారా ఎలాంటి ఆశలు లేని నిస్వార్థమైన ప్రేమను శ్రీకృష్ణుడు లోకానికి చాటారని అన్నారు.

అలాగే వర్గ, కుల, మత భేదాలకు అతీతంగా సుధాముడు వంటి పేద స్నేహితుడిని సైతం గుండెలకు హత్తుకుని సమానత్వాన్ని బోధించారని తెలిపారు. పుట్టుకతోనే కంసుని చెరసాలలో కష్టాలు ప్రారంభమైనప్పటికీ, జీవితాంతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ప్రశాంతతతో సమస్యలను ఎదుర్కోవడం శ్రీకృష్ణుని ప్రత్యేకత అని ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఇలాంటి పండుగలను పాఠశాలలో నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్శేటి లక్ష్మీనారాయణ, కంకెల్కార్ మోహన్, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు లిక్కిడి మంజుల, పులి శారద, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.