దమ్మపేట, నవ పక్షం ప్రతినిధి :
దమ్మపేట మండలంలో లో కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాల సలహా మండలి లో సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎన్టియుసి కేంద్ర కార్మిక సంఘాల ను విస్మరించడాన్ని నిరసిస్తూ సోమవారం దమ్మపేట లో సిఐటియు ఆధ్వర్యంలో ప్ల కార్డ్స్ తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ ప్రధాన కార్మిక సంఘాలను పక్కనపెట్టి తనకు అనుకూలమైన సంఘాలతో బోర్డును ఏర్పాటు చేసుకుంటుందని ఫలితంగా కార్మికుల వేతనాలను అణిచివేయడానికి యాజమాన్యాలకు అనుకూలమైన విధానాలను చట్టబద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. సిఐటియును కనీస వేతన సలహా బోర్డు నుంచి తప్పించడం ద్వారా దేశంలోనే కోట్లాది కార్మికుల సమస్యలను వారి హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలని అణచివేయలేరని కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న ఈ కక్షపూరిత వైకిరిని కార్మికులను సంఘటితపరిచి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని అన్నారు. కేంద్ర కనీస వేతన బోర్డులో సిఐటియు మిగతా సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు నరసయ్య వీర్రాజు శ్రీను వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


