వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన సర్పంచ్

దమ్మపేట,నవ పక్షం,జిల్లా ప్రతినిధి :-

మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, వైస్ సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావులు వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పగడాల రమాదేవి మాట్లాడుతూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలను పూజించడం వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) తో చేసిన విగ్రహాలు నీటిలో కరగడానికి చాలా సమయం పడుతుందని, మట్టి విగ్రహాలు నీటిలో వేగంగా, సహజంగా కరిగిపోతాయని తెలిపారు. మట్టి విగ్రహాలలో రసాయన రంగులు, విషపూరిత పదార్థాలు లేకపోవడం వల్ల చెరువులు, నదులలోని చేపలు, ఇతర జీవరాశులకు ప్రాణాపాయం ఉండదని అన్నారు.

మట్టి విగ్రహాలను ఇంట్లోనే బకెట్ లేదా తొట్టెలో నీటిని నింపి ఇంట్లోనే నిమజ్జనం చేయవచ్చని సూచించారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, నిమజ్జన ఊరేగింపుల్లో రద్దీ తగ్గుతుందని తెలిపారు. విగ్రహం కరిగిన తర్వాత ఆ మట్టిని, నీటిని ఇంటి మొక్కలకు లేదా పూల కుండీలకు ఎరువుగా వాడుకోవచ్చన్నారు. సీడ్ గణపతి అయితే ఆ మట్టి నుంచే మొక్క మొలకెత్తుతుందని తెలిపారు.

సహజ సిద్ధమైన బంకమట్టి, పసుపు, కుంకుమ వంటి వాటిని వాడటం వల్ల చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు వుండవన్నారు. మన పురాణాల ప్రకారం పార్వతీదేవి నలుగు పిండితో (మట్టి రూపం) వినాయకుడిని తయారుచేసిందని, కాబట్టి మట్టి విగ్రహాన్ని పూజించడమే శాస్త్రోక్తం, సాంప్రదాయమని తెలిపారు. మట్టి విగ్రహాలను కొనుగోలు చేయడం వల్ల స్థానిక కుమ్మరులకు, కళాకారులకు ఆర్థిక తోడ్పాటు లభిస్తుందన్నారు. ఈ వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలు ఆనందోత్సవంతో, భక్తిభావంతో జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.