ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి

నవపక్షం, చౌటుప్పల్ మండల ప్రతినిధి : 

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనను స్వర్ణయుగంగా అభివర్ణించారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ, 104 సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు, పావలా వడ్డీ రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు, రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు.

అలాగే రాష్ట్ర అభివృద్ధికి పలు నూతన ప్రాజెక్టులను నిర్మించి ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందించిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, మండల మరియు మున్సిపాలిటీ అధ్యక్షులు బోయ దేవేందర్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, వెలగ రాజశేఖర్ రెడ్డి, రామాలయం చైర్మన్ బొబ్బిల్లా మురళి, సర్పంచులు తిగుళ్ల చంద్రయ్య, గంజి వనజ కృష్ణ, రాజు నాయక్, కౌన్సిలర్లు కోసనం రాకేష్ రెడ్డి, పాక చిరంజీవి, పిల్లలమర్రి మధుసూదన్, బద్రి గాలయ్య, కాసర్ల మంజుల, చింతల ఉమా మహేశ్వరి, బత్తుల వాణి, కో-ఆప్షన్ సభ్యులు బాబా షరీఫ్, సందగల్ల విజయ సతీష్, షేక్ పతీమజానీ బాబు, పస్తం గంగారాం, మార్కెట్ డైరెక్టర్లు పబ్బు శ్రీకాంత్, బోయ వెంకట్, మాజీ మండల, మున్సిపల్ అధ్యక్షులు బక్క శ్రీనాథ్, సురవి నరసింహ గౌడ్, ఉపసర్పంచులు బొమ్మకంటి కిశోర్, గడ్డం సత్యం, మాజీ సర్పంచులు గోపి సుధాకర్, జాల మల్లేష్ యాదవ్, వెల్వర్తి యాదగిరి, పాల సంఘం చైర్మన్ డిల్లీ శేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కొయ్యడ సైదులు గౌడ్, అంతటి బాలరాజు, డీసీసీ కార్యదర్శి బత్తుల భద్రం, కేతరాజ్ అచ్చయ్య, నీలు నాయక్, షాదీఖానా చైర్మన్ కరీం తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.