మల్లపురాజుపల్లి విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామానికి చెందిన శ్రీ వట్టికోటి రాములు–ఇందిర దంపతుల కుమార్తె వట్టికోటి వైష్ణవి ఇంటర్మీడియట్‌లో బైపీసీ గ్రూపులో 963 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.

అనంతరం NEET-2026 పరీక్షలో 413 మార్కులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 2,41,664వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 6,301వ ర్యాంకు, BC-A కేటగిరీలో 239వ ర్యాంకు సాధించారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందారు.

మారుమూల ప్రాంతమైన నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామం నుంచి తొలిసారిగా ఒక విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు సాధించడం గ్రామానికి ఎంతో గర్వకారణమని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. బీసీ వర్గానికి చెందిన విద్యార్థిని ప్రతిభతో మెడికల్ సీటు సాధించడం ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

వైష్ణవి తల్లిదండ్రులు వృత్తిరీత్యా ఉద్యోగస్తులు. తండ్రి సిద్దిపేట జిల్లాలో ఏపీవోగా విధులు నిర్వహిస్తుండగా, తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చనే దానికి వైష్ణవి విజయం నిదర్శనమని గ్రామస్తులు, బంధువులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వట్టికోటి వైష్ణవిని గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందించి, ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి మంచి వైద్యురాలిగా సేవలందించాలని ఆకాంక్షించారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.