యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు – సుమారు రూ.20 లక్షల విలువైన మొబైల్ ఫోన్లు రికవరీ

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : 

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల నిరంతర కృషితో CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, చోరీకి గురైన 100 మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేశారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

పౌరులు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న CEIR వారియర్ అధికారులు ఫిర్యాదుదారుల వివరాలను CEIR పోర్టల్‌లో నమోదు చేశారు. అనంతరం సంబంధిత మొబైల్ ఫోన్ల IMEI నంబర్ల ఆధారంగా నిరంతరం ట్రాకింగ్ చేపట్టారు.

CEIR వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ పోలీసు అధికారులు చేపట్టిన నిరంతర పర్యవేక్షణ, సాంకేతిక చర్యల ఫలితంగా Samsung, OnePlus, Vivo, Oppo తదితర ప్రముఖ బ్రాండ్లకు చెందిన 100 మొబైల్ ఫోన్లను తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి రికవరీ చేశారు.

రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ IPS వాటి అసలైన యజమానులకు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ మరియు CCS ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ IPS మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, మొబైల్‌కు సంబంధించిన IMEI నంబర్ వివరాలను అందించాలని సూచించారు. CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

ప్రజల ఆస్తి, వ్యక్తిగత సమాచార భద్రతకు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.