నవపక్షం, హైదరాబాద్, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్: దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఖండిస్తూ హైదరాబాద్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ వరంగల్ రవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు, చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. దళితుడిని అవమానించడం అంటే రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.
దళితుల మనోభావాలను గౌరవించి, వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలకు బాధ్యులు ఉంటే తగిన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం దళిత సమాజం ఐక్యంగా, రాజ్యాంగబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు.


