నవపక్షం, ఖమ్మం జిల్లా ప్రతినిధి :
ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశాన్ని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేజండ్ల సాయికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి ఖాలీద్ అహ్మద్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, ఖమ్మం అర్బన్ డీసీసీ అధ్యక్షుడు నాగెండ్ల దీపక్ చౌదరి, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి వెంకటేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, యువతను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, రాబోయే కార్యక్రమాలపై కార్యవర్గ సభ్యులతో చర్చించారు. యువత సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి యువజన కాంగ్రెస్ కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అంజనీ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఖలీల్, బెజ్జం బాలగంగాధర్, బానోత్ కోటేష్, ఆదర్శ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బెల్లంకొండ శరత్, బిచ్చల అన్వేష్, బాలరాజు, అసెంబ్లీ ఉపాధ్యక్షులు అంబటి ఈశ్వర్, జంగం రాజేష్, సన్నీ యాదవ్, కిట్టు, మండల అధ్యక్షులు ముత్తారావు, జనప్రియ కుమార్, నిమ్మల నాగేశ్వరరావు, దొడ్డ వేణు, యడవల్లి నాగరాజు, దుడిమెట్ల వెంకట్, కూన వీరారెడ్డి, హృదయ్ కిరణ్, బెల్లం సాయితేజ, యడ్లపల్లి తరుణ్, సందీప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితర యువజన కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


