నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికల నేపథ్యంలో మాదాపురం శ్రీకాంత్ సప్పిడి రాజన్ రాజేందర్ రెడ్డి నల్ల జై రామ్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్యానల్‌కు చెందిన సభ్యులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో మాదాపురం శ్రీకాంత్ చప్పిడి రాజేందర్ రెడ్డి నల్ల జై రామ్ రెడ్డితో పాటు ఆయన ప్యానల్ సభ్యులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
ఈ సందర్భంగా మాదాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా తమ ప్యానల్ కృషి చేస్తుందని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆశయాలకు అనుగుణంగా మానవతా సేవలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
నామినేషన్ కార్యక్రమంలో ప్యానల్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


