EMRS గండుగులపల్లి స్కూల్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు
అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండల పరిధిలోని EMRS (ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్) గండుగులపల్లి పాఠశాలలో నేను సైతం చేయూత కార్యక్రమంలో భాగంగా విద్యా యాత్ర మన MLA – మన బడి అనే కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం (రివ్యూ మీటింగ్) నిర్వహించారు. విద్యార్థుల చదువు నైపుణ్యాలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గారు, విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని తెలియజేస్తూ, ఉపాధ్యాయులు అందిస్తున్న బోధనా అంశాలపై సమగ్రంగా చర్చించారు.
అనంతరం ఎమ్మెల్యే గారు స్వయంగా విద్యార్థులకు టిఫిన్/భోజనం వడ్డించారు, మరియు వారితో కలిసి భోజనం చేశారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆరా తీస్తూ విద్యాబుద్ధులు నేర్పించి మార్గదర్శనం చేశారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఈద్దప్ప గారు,మాజీ సర్పంచ మడకం రాజేష్ గారు,మాజీ సర్పంచ్ కారం సుధీర్ గారు,మరియు తల్లిదండ్రుల, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు…


