నవపక్షం, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా డీజీపీ సి.వి. ఆనంద్ మామ్నూర్‌లోని 4వ బెటాలియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్‌లోని మౌలిక వసతులు, సిబ్బంది డిప్లాయ్‌మెంట్లు, సంక్షేమ కార్యక్రమాలను ఆయన సమీక్షించారు.
బెటాలియన్ సిబ్బందితో సమావేశమైన డీజీపీ, వారి విధులు, ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది బదిలీల ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన సందర్భాల్లో బలగాలను వేగంగా మొబిలైజ్ చేసేలా సమన్వయం, సన్నద్ధత పెంచుకోవాలని సూచించారు.
విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై కూడా సిబ్బంది దృష్టి సారించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీసు సిబ్బందికి డీజీపీ పిలుపునిచ్చారు.
బెటాలియన్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు డీజీపీ సూచించారు.






