నవపక్షం, నల్గొండ జిల్లా ప్రతినిధి : నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ బైపాస్ జంక్షన్ వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, పద్మానగర్ బైపాస్ జంక్షన్ వద్ద ఓ డీసీఎం వాహనం రోడ్డు దాటుతున్న సమయంలో విజయవాడ వైపు నుంచి బుల్లెట్‌పై వచ్చిన వ్యక్తి డీసీఎంను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బుల్లెట్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనాల కదలికలు తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.





