చేతి వృత్తులవారందరూ శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలు టీడీపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్

నవపక్షం, ఉయ్యూరు ప్రతినిధి, ఆగస్టు 10: చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులందరూ శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలని తెలుగుదేశం పార్టీ జాతీయ వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఉయ్యూరులోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో సోమవారం ఆటో వర్కర్స్, బ్యాటరీస్, టైర్స్ రంగాలకు చెందిన యూనియన్ నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, టూ వీలర్ మెకానిక్స్‌తో పాటు ఆటోమొబైల్ రంగానికి చెందిన కార్మికులంతా కవి శ్రీశ్రీ చెప్పినట్లు “శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలు” అని పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి, ఆయిల్, బురద, మట్టితో కలిసిపోయి తమ చేతులకు, ఒంటికి, దుస్తులకు మరకలు అంటుకున్నా, ప్రజల వాహనాలను సక్రమంగా పనిచేసేలా మరమ్మతులు చేస్తూ సేవలందిస్తున్నారని కొనియాడారు.

ఉయ్యూరులోనే సుమారు 100 మంది టూ వీలర్ మెకానిక్స్, ఆటోమొబైల్ రంగ కార్మికులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతోందని, పాత సాంకేతికతకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల వంటి నూతన సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు.

ఈ మార్పులకు అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుని, నూతన సాంకేతికతపై శిక్షణ పొందాలని ఆయన సూచించారు. వారి వృత్తిపరమైన అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ వారి సోదరుడిగా అండగా ఉంటానని రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు.

అనంతరం యూనియన్ నాయకులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ను గజమాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఫజలుల్ మజీద్, బైక్ మెకానిక్ యూనియన్ అధ్యక్షులు అక్బర్ బాషా, యూనియన్ కార్యదర్శి అబ్దుల్ మాబూద్, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు సయ్యద్ అజ్మతుల్లా, పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.

Hot this week

టీటీడీ జేఈవోగా శ్రీ ప్రభల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ

తిరుమల, ఆగస్టు 10 (నవపక్షం): టీటీడీ నూతన జేఈవో (వైద్యం, విద్య)గా...

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 36 ఏళ్ల తర్వాత కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న 1989–90 బ్యాచ్ విద్యార్థులు

నవపక్షం, దమ్మపేట ప్రతినిధి: దమ్మపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 1989–90 సంవత్సరాల్లో...

శ్రీ వాత్సల్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

వరంగల్ ఆరేపల్లి, ఆగస్టు 10 (నవపక్షం జిల్లా ప్రతినిధి – బండారి...

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా 4.21 లక్షల మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా

నవపక్షం, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని నమోదిత మత్స్యకారుల సామాజిక భద్రతకు తెలంగాణ...

విశ్రాంత ఉద్యోగి ఉప్పల మల్లయ్యకు మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి నివాళులు

నవపక్షం, తిరుమలగిరి ప్రతినిధి: తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ...

Topics

టీటీడీ జేఈవోగా శ్రీ ప్రభల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ

తిరుమల, ఆగస్టు 10 (నవపక్షం): టీటీడీ నూతన జేఈవో (వైద్యం, విద్య)గా...

శ్రీ వాత్సల్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

వరంగల్ ఆరేపల్లి, ఆగస్టు 10 (నవపక్షం జిల్లా ప్రతినిధి – బండారి...

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా 4.21 లక్షల మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా

నవపక్షం, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని నమోదిత మత్స్యకారుల సామాజిక భద్రతకు తెలంగాణ...

విశ్రాంత ఉద్యోగి ఉప్పల మల్లయ్యకు మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి నివాళులు

నవపక్షం, తిరుమలగిరి ప్రతినిధి: తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ...

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభకు కేటీఆర్, హరీష్ రావు హాజరు

నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది...

ఇంటింటికీ కళ్లద్దాల పంపిణీ చేసిన 20వ వార్డు కౌన్సిలర్ ఎం.డి. హన్ను బాయ్

నవపక్షం, మునుగోడు ప్రతినిధి : శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల...

నకిరేకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డీసీఎంను ఢీకొన్న బుల్లెట్.. ఘటనాస్థలంలోనే మృతి

నవపక్షం, నల్గొండ జిల్లా ప్రతినిధి : నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ బైపాస్...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img
App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.