మోత్కూర్, ఆగష్టు 09, నవపక్షం :
మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని 8వ వార్డు అంగడి బజార్ కు చెందిన ఆరె జహంగీర్ ఇటీవల మృతి చెందగా శనివారం ఆ కుటుంబాన్ని అతని స్నేహితులు పరామర్శించారు. కుటుంబానికి మనోధైర్యం కల్పించి స్నేహితులంతా కలిసి సేకరించిన రూ.67 వేల ఆర్ధిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోయిని యాకు, ఎడ్ల తిరుమలేష్, పురుగుల శ్రీను, అవిశెట్టి యాదగిరి, బుర్ర ఉపేందర్, అవిశెట్టి కిరణ్ కుమార్, పురుగుల మల్లేష్, ఎడ్ల శేఖర్, అవిశెట్టి మధు, ఎలిమినేటి సాయికుమార్, అవిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.






