మోత్కూర్, ఆగష్టు 08, నవపక్షం :
మోత్కూర్ మున్సిపాలిటీ పద్మశాలి సంఘం అధ్యక్షులు కూరపాటి రాములు గారి అధ్యక్షతన సంఘ కార్యవర్గ సమావేశము జరిపారు.ఈ సమావేశంలో అధ్యక్షులు కూరపాటి రాములు మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యతతో ఉండి సంఘాలను బలోపేతం చేసుకోవాలని కోరారు.ప్రభుత్వము చేనేత కార్మికులకు ప్రకటించిన పథకాలను అన్ని అమలుపరిచి చేనేత కార్మికులను ఆదుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వము ప్రకటించిన నేతన్న భరోసా,నేతన్న పొదుపు బకాయిలను విడుదల చేయాలని అన్నారు.నేత కార్మికులకు సంబంధించినటువంటి రంగు రసాయనాలను ధరలను తగ్గించాలని అన్నారు. సహకార సంఘాలకు బ్యాంకులలో ఉన్న అప్పులను ప్రభుత్వము మాఫీ చేసి చేనేత సహకార సంఘాలను కాపాడాలని మరియు సంఘాల ద్వారా చేరేత కార్మికులకు పని కల్పించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం లో
సంఘ ఉపాధ్యక్షులు ఎలగందుల సత్యనారాయణ,కార్యదర్శి పసునూరి యాదయ్య,కోశాధికారి నోముల రమేష్,జోగు రామచంద్రం,పసునూరి రమేష్, జెల్ది రాములు,పెండం శ్రీనివాసు,
జల్ది సత్యనారాయణ,వంగరి బాలరాజు,బిరుదు శ్రీను,
గుర్రం రవి తదితరులు పాల్గొన్నారు.






