సీనియర్ల ఆశీస్సులతో.. సమన్వయంతో కాంగ్రెస్‌ బలోపేతానికి సమ్మయ్య గౌడ్‌ అడుగులు కాంగ్రెస్‌ ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మండల ప్రెసిడెంట్ సమ్మయ్య గౌడ్‌

నవపక్షం, కేసముద్రం ప్రతినిధి: కాంగ్రెస్‌ పార్టీ కేసముద్రం మండల నూతన ప్రెసిడెంట్ గా నియమితులైన చిలువేరు సమ్మయ్య గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్‌ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మాజీ మండల ప్రెసిడెంట్ అల్లం నాగేశ్వరరావు, కేసముద్రం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రామా నాగేశ్వరరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీత వెంకన్న, సీనియర్‌ నాయకులు, ఎంపీటీసీ, సర్పంచ్‌ బండారు సుజాత దయాకర్‌ గౌడ్‌, తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గూగులోతు దస్రు నాయక్‌, జిల్లా స్పోక్స్‌పర్సన్‌ అంబటి మహేందర్‌ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బండారు పద్మ, మాజీ PACS చైర్మన్‌ బండారు వెంకన్న, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నీలం సుహాసిని–దుర్గేష్‌ తదితరులను సమ్మయ్య గౌడ్‌ కలిసి శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల పార్టీ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్‌ నాయకుల సూచనలు, సలహాలు తీసుకుంటూ, వారి అనుభవాన్ని గౌరవిస్తూ అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతానని అన్నారు.

కేసముద్రం మండలంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని సమిష్టిగా పనిచేస్తూ పార్టీకి మరింత బలమైన పునాది వేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో చేపట్టబోయే పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటూ ముందుకు సాగుతానని, కేసముద్రం మండలంతో పాటు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని సమ్మయ్య గౌడ్‌ తెలిపారు.

ఈ సందర్భంగా సీనియర్‌ నాయకులు సమ్మయ్య గౌడ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

Hot this week

భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్‌ను పరామర్శించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి: ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై తన నివాసంలో...

ప్రభుత్వ సొమ్ముతో వరుణ యాగాలు చేయడం సిగ్గుచేటు – మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నాగార్జునసాగర్‌లో వరుణ యాగం పేరుతో ప్రభుత్వ...

నకిరేకల్‌లో ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రారంభం – వేముల వీరేశం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్దీపన ఎడ్యుకేషన్...

శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోషకాహారం పంపిణీ

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్...

Topics

ప్రభుత్వ సొమ్ముతో వరుణ యాగాలు చేయడం సిగ్గుచేటు – మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నాగార్జునసాగర్‌లో వరుణ యాగం పేరుతో ప్రభుత్వ...

నకిరేకల్‌లో ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రారంభం – వేముల వీరేశం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్దీపన ఎడ్యుకేషన్...

శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోషకాహారం పంపిణీ

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్...

టీటీడీ జేఈవోగా శ్రీ ప్రభల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ

తిరుమల, ఆగస్టు 10 (నవపక్షం): టీటీడీ నూతన జేఈవో (వైద్యం, విద్య)గా...

శ్రీ వాత్సల్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

వరంగల్ ఆరేపల్లి, ఆగస్టు 10 (నవపక్షం జిల్లా ప్రతినిధి – బండారి...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img
App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.