4 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి… జిఎంపిఎస్ మండల కార్యదర్శి పాక జహంగీర్

ఆగస్టు 20, (రామకృష్ణాపురం, చీమల కొండూరు, ముస్త్యల పెల్లి చందుపట్ల )ఈనెల 22, 23 , 24 తేదీలలో చెంగిచెర్ల లో నిర్వహించే రాష్ట్ర 4 వ మహాసభలను జయప్రదం చేయాలని గొర్రెల మేకల పెంపకదారుల సంఘం మండల కార్యదర్శి పాక జహంగీర్ కోరారు. గురువారం భువనగిరి మండలంలోని రామకృష్ణాపురం, చీమల కొండూరు, ముస్తాలపల్లి , చందుపట్ల గ్రామాలలో జి ఎం పి ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో 4 వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆయా గ్రామాల సొసైటీ అధ్యక్షులతో కలిసి ఆవిష్కరించి, మాట్లాడారు. గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 22వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్ల లో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా సబ్సిడీపై గొర్రెల పంపిణీ అనగా నగదు బదులు పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని, గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, గొర్రెల మందకు వచ్చి పశువైద్యాధికారులు
వైద్యం చేయాలని కోరారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో గొల్ల కురుమలకు యువతకు ప్రత్యేక రాయితి కల్పించాలని కోరారు. సీజనల్ రోగాలపై అవగాహన కల్పిస్తూ, మండల వద్ద సంబంధిత టీకాలను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ, గొర్రెలకు వైద్యం అందించని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. సబ్ సెంటర్ లను జిల్లా అధికారులు తనిఖీ చేసి, గొర్రెల వైద్యం పురోగతిపై సమీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ మండల ఉపాధ్యక్షులు తోటకూర అశోక్, ఆయా గ్రామాల సొసైటీ అధ్యక్షులు బాల్ద రవి, చిన్నం శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, మాజీ ఎంపిటిసి మాయ బాల నరసింహ, మాజీ సర్పంచ్ చిన్నం పాండు, సింగిల్ విండో డైరెక్టర్ చిన్నం ఉప్పలయ్య,
సంఘం నాయకులు సుబ్బురు జహంగీర్, వడ్డే ఆంజనేయులు, చిన్నం పాండు, నారి శ్రీశైలం, మాయ రవి, చిన్నం వెంకటేష్,వడ్డే నరసింహ, మల్లేష్, చంద్రయ్య, సాయిబాబు, బీరయ్య,లక్ష్మి, కవిత, సుబ్బురు శ్రీశైలం, బండ వెంకటేష్, రాములు, మహేష్, భూమయ్య, సత్యనారాయణ, కొండల్ పాల్గొన్నారు.

Hot this week

బాధిత కుటుంబానికి మంత్రి ఆర్థిక సహాయం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  రసూల్‌పూర్ గ్రామానికి చెందిన తీగల అమృత...

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి లక్ష్మీ రాజు గోపాల్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :  చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో చత్రపతి యూత్...

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి – జక్కిడి శివచరణ్ రెడ్డి

నవపక్షం, జనగామ ప్రతినిధి :  యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయభాను చిబ్...

కోడూరు రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించిన గండ్ర వెంకటరమణారెడ్డి

  నవపక్షం, కొత్తపల్లిగోరి ప్రతినిధి : మండల కేంద్రంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన కోడూరు...

రంగ కవిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పచ్చిమడ్ల మానస గౌడ్

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  మహిళా నాయకురాలు, యాదాద్రి భువనగిరి...

Topics

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహణ

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ దేవరకొండ పట్టణ శాఖ...

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.