నాంపల్లి మండలంలోని చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కొరత ఉందని, వెంటనే అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలని మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసిన BJYM మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్. ఈ సందర్బంగా నాంపల్లి సతీష్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన మేరకు ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచడం విద్యాశాఖ బాధ్యత అని పేర్కొన్నారు.నాంపల్లి మండలంలో గానీ,నల్లగొండ జిల్లాలోని ఇతర పాఠశాలల్లో గానీ విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే అదనంగా ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలను గుర్తించి,అవసరమైన చోట్లకు సర్దుబాటు చేయాలని కోరారు.అందులో భాగంగా చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలకు వెంటనే ఒక ఉపాధ్యాయుడిని కేటాయించి విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి చిట్టెంపహాడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిని నియమించాలని నాంపల్లి సతీష్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి పొలగోని శ్రీకాంత్, సుంకరి శంకర్, మరేపాకుల శివ, నాంపల్లి శంకర్, నాంపల్లి శివ తదితరులు పాల్గొన్నారు
చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలకు అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలి -BJYM మండల ప్రెసిడెంట్ నాంపల్లి సతీష్
Popular Categories


