దమ్మపేట మండలంలో రక్షాబంధన్ ఏ రోజు జరుపుకుంటారు అనే దానిపై విజయ్ మారుతి శర్మ ఈ విధంగా వివరణ ఇచ్చరు.భద్రకరణ సమయంలో రక్షాబంధనం నిషిద్ధం.
కనుక భద్రకరణం లేని సమయంలోనే రక్షాబందనం ఆచరించాలి.
. అపరాహ్నం, ప్రదోష కాలంలోనే రక్షాబంధనం కట్టాలి. పై రెండు సమయాలలో భద్రకరణ ఛాయలున్నవి. కనుక భద్రకరణ స్పర్శ తగలకుండా రాఖీ కట్టాలి.
. వర్జ్య, దుర్ముహూర్తాలు కూడా స్పర్శించకుండా రక్షాబంధనం ఆచరించాలి. ఇవన్నియు నియమాలు.
. శ్రీ పరాభవ శ్రావణ పూర్ణిమ 2026 ఆగష్ట్ 27 గురువారం ఉదయం 9.08 గంటల నుంచి మొదలై 28 ఆగష్ట్ శుక్రవారం ఉదయం 9.48 గంటలకు పూర్ణిమ ముగియును. పూర్ణిమ తిథి అపరాహ్న వ్యాప్తిలో వున్నప్పుడే రక్షాబంధనమును ఆచరించాలి. ఒకవేళ భద్రకరణ ఛాయ వున్నచో ప్రదోష కాలంలో ఆచరించాలి.
. కానీ గురువారం ఉదయం 9.08 గంటల నుంచి రాత్రి 9.32 గంటల వరకు భద్రకరణం కొనసాగుతున్నది. ముఖ్యంగా అపరాహ్న కాలంలోనూ మరియు ప్రదోష కాలంలోనూ భద్రకరణమున్నది. కనుక రక్షాబంధనం ఏ సమయంలో ఆచరించాలనేది పలువురికి సందేహం వచ్చును.
కనుక 28 ఆగష్ట్ 2026 శుక్రవారం ఉ. 5.54 నుంచి ఉ. 9.48 మధ్యనే రక్షాబంధనం ఆచరించుకోవాలి. కానీ ఈ సమయంలో వర్జ్య, దుర్ముహూర్తాలు వుంటాయి. ఇవి కూడా స్పర్శించకుండా రక్షాబంధనం ఆచరించాలంటే…
28 శుక్రవారం ఉ. 5.54 నుంచి ఉ. 8.23 వరకు
తిరిగి ఉ9.15 నుంచి 9.44 వరకు రక్షాబంధనమాచరించుటకు శుభకరం. అని తెలియజేశారు


