దేశభాషలందు తెలుగు లెస్స.. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్

నవపక్షం, వేములవాడ ప్రతినిధి : ఆగస్టు 29:

తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. వ్యవహారిక భాషోద్యమానికి ఆద్యుడు గిడుగు రామమూర్తి పంతులు, భారతదేశ గొప్ప హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. “దేశభాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాష ఎంతో మధురమైనదని అన్నారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా ప్రసిద్ధి చెందిన తెలుగు భాషకు సుసంపన్నమైన చరిత్ర ఉందని, మన భావాలను వ్యక్తీకరించడంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో మాతృభాషకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.

గ్రాంథిక భాషను సామాన్యులకు సులభంగా అర్థమయ్యే వ్యవహారిక భాషగా మార్చేందుకు గిడుగు రామమూర్తి పంతులు విశేష కృషి చేశారని కొనియాడారు. తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

అదేవిధంగా మేజర్ ధ్యాన్ చంద్‌ను “హాకీ మాంత్రికుడు” గా పిలుస్తారని, హాకీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని శారీరక దృఢత్వాన్ని సాధించాలని సూచించారు. ప్రతిభగల క్రీడాకారులను ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్శేటి లక్ష్మీనారాయణ, కంకెల్కార్ మోహన్, అంగన్వాడీ ఉపాధ్యాయురాళ్లు లిక్కిడి మంజుల, పులి శారద, విద్యార్థులు పాల్గొన్నారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.