14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

నవపక్షం, చౌటుప్పల్ | సెప్టెంబర్ 1:

చౌటుప్పల్ పట్టణ MROకు DSP జిల్లా కార్యదర్శి BR సాయి కుమార్ ఆధ్వర్యంలో BC, SC, ST-JAC మరియు DSP సంయుక్త కమిటీల నాయకులు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా DSP జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల శాంతి కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఫీజులు చెల్లించలేని పరిస్థితి కారణంగా ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కళాశాలల్లో తమ చదువులను కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఆలస్యం కావడం వల్ల విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని, కొందరు విద్యార్థులు చదువులను మధ్యలోనే నిలిపివేస్తున్నారని తెలిపారు. ఈ సమస్య ప్రభావం సుమారు కోటి కుటుంబాలపై పడుతోందని పేర్కొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో DSP జిల్లా ఉపాధ్యక్షులు జలందర్, JAC జిల్లా నాయకులు చెక్క కిరణ్ ముదిరాజ్, జోగు నర్సింగ్, యంజాల శ్రీకాంత్, చెక్క సాయి కుమార్, భట్టు సాయి, బోయ కుమార్, జోగు స్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.