నవపక్షం, చౌటుప్పల్ | సెప్టెంబర్ 1:
చౌటుప్పల్ పట్టణ MROకు DSP జిల్లా కార్యదర్శి BR సాయి కుమార్ ఆధ్వర్యంలో BC, SC, ST-JAC మరియు DSP సంయుక్త కమిటీల నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా DSP జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల శాంతి కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఫీజులు చెల్లించలేని పరిస్థితి కారణంగా ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కళాశాలల్లో తమ చదువులను కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఆలస్యం కావడం వల్ల విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని, కొందరు విద్యార్థులు చదువులను మధ్యలోనే నిలిపివేస్తున్నారని తెలిపారు. ఈ సమస్య ప్రభావం సుమారు కోటి కుటుంబాలపై పడుతోందని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో DSP జిల్లా ఉపాధ్యక్షులు జలందర్, JAC జిల్లా నాయకులు చెక్క కిరణ్ ముదిరాజ్, జోగు నర్సింగ్, యంజాల శ్రీకాంత్, చెక్క సాయి కుమార్, భట్టు సాయి, బోయ కుమార్, జోగు స్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


