హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని పరిశీలించిన ముఖ్యమంత్రి

నవపక్షం, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్‌లో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. హకీంపేట్ చేరుకున్న ముఖ్యమంత్రి వివిధ విద్యా సంస్థల భవన సముదాయాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య, వెటర్నరీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, 400 పడకల ఆసుపత్రితో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు, హాస్టల్ భవన సముదాయాల నిర్మాణాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.

ఎడ్యుకేషన్ హబ్‌లో చేపడుతున్న అన్ని నిర్మాణ పనుల్లో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నిర్మాణాల నాణ్యతతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్ అవసరాలకు, ల్యాండ్‌స్కేపింగ్ పనులకు వినియోగించుకునేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

అనంతరం నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

Hot this week

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

Topics

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు...

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.