మృగశిర నక్షత్రం పురస్కరించుకొని శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం. శనివారం సందర్భంగా జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు సమర్పించారు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం శ్రావణ మాసం కృష్ణ పక్షము వర్ష ఋతువు నవమి సెప్టెంబర్ 05వ తేదీ.కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది.సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు,ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించడం జరిగింది.ఈరోజు 5:45 నిమిషాలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు.ఉదయం 6 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధ భరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు.ఉదయం 7 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేయి నామాల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు.స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో ఈరోజు మృగశిర నక్షత్రం పురస్కరించుకొని శ్రీ పద్మావతి అమ్మవారి కి నవకలశ పంచామృత అభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు.అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని పట్టు చీరతో దివ్యాభరణాలతో పుష్ప మాలికలతో అలంకరించి అష్టలక్ష్మి మంటపంలోకొలువుదీర్చారు. అష్ట ఐశ్వర్య ప్రాప్తి కోసం మహాలక్ష్మి హావనం నిర్వహించారు.ఉదయం 10:30 లకు విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి మరియు సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.భక్తులు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు.ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3600 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.సాయంత్రం 6:30 కు ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు.స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో శనివారం సందర్భంగా జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు సమర్పించారు.స్వర్ణగిరి దివ్య దేవస్థానంలో శ్రావణ మాసం సందర్బంగా సాయంత్రం 7:30 నిమిషాలకు శ్రీ పద్మావతి అమ్మవారి కి విశేషంగా సహస్ర కుంకుమార్చన సేవ అర్చక స్వాములు నిర్వహించారు.

Hot this week

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహణ

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ దేవరకొండ పట్టణ శాఖ...

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

Topics

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహణ

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ దేవరకొండ పట్టణ శాఖ...

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.