నవపక్షం, దమ్మపేట ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ విజయ్ బాబు పుట్టినరోజు వేడుకలను దమ్మపేట మండల కేంద్రంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి మువ్వ విజయ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొక్కిరాల రమేష్, చిన్నంశెట్టి యుగంధర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాక రమేష్, ఆత్మ కమిటీ మెంబర్ ఏసు మణి, ముళ్ళపూడి వెంకటేశ్వరరావు, పగడాల రాంబాబు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.


