నవపక్షం, మద్నూర్ మండల ప్రతినిధి:
తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పొలాల అమావాస్య (కాడెద్దుల పండుగ) వేడుకలను అంతపూర్ గ్రామంలో గ్రామస్థులు ఘనంగా, వైభవంగా నిర్వహించారు. వ్యవసాయంలో అన్నదాతలకు అండగా నిలిచే ఎద్దుల పట్ల కృతజ్ఞతను చాటుకుంటూ గ్రామస్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి అంతపూర్ గ్రామ BRS పార్టీ అధ్యక్షులు వాగ్మారే మారుతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ పెద్దలు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఆధునిక కాలంలో వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగినప్పటికీ, ప్రకృతితో, పశువులతో ముడిపడిన మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పశువుల ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ఇటువంటి సంప్రదాయ వేడుకలను కొనసాగించడం అవసరమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులు ఆనందోత్సాహాలతో పొలాల అమావాస్య వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, రైతులు, యువకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


