దమ్మపేట, నవపక్షం కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :-
కొత్తగూడెం జిల్లా సమాఖ్య ప్రతినిధుల పర్యవేక్షణ లో దమ్మపేట మండల సమాఖ్య కార్యాలయం నందు మండల సమాఖ్య ప్రతినిధులచే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నిధులు, ఖర్చులు ఆదాయ వ్యయాలు అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను సంఘాల మహిళల అభ్యున్నతికి చేపట్టవలసిన కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడం జరిగింది.అదేవిధంగా పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగిసిన వారి స్థానం లోకొత్తవారిని ఎంపికచేయడం జరిగింది. ఈ సమావేశానికి మండల సమాఖ్య ఎ.పియం, సంతోష్ కుమార్ మరియు సిబ్బంది తో పాటుగా జిల్లా నుండి డి.పి.యం బ్యాంకు లింకేజి,జీవనోపాధులు సమ్మక్క, డి.పి.యం నాన్ ఫాం నర్సయ్య గార్లతో పాటుగా జిల్లా సమాఖ్య కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మౌనిక, సరస్వతి లు హాజరయ్యారు.


